Take a fresh look at your lifestyle.

నాణ్యమైన విత్తనాలనే వినియోగించాలి -రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్ అన్వేష్ రెడ్డి

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రైతులు రాష్ట్ర విత్తన సంస్థ పంపిణీ చేసే సీడ్స్ వినియోగించేలా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్ అన్వేష్ రెడ్డి అన్నారు. ఆయన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తో కలిసి నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి వారి ఉన్నతికి విత్తన సంస్థ పనిచేస్తుందన్నారు. డీలర్లు ప్రభుత్వం తయారు చేసే విత్తనాలు రైతులు వినియోగించేలా ప్రచారం కల్పించాలన్నారు. విత్తనాభివృద్ధి సంస్థ పంపిణీ చేసే విత్తనాలు అన్ని నాణ్యతా పరంగా ఉత్తమమైనవన్నారు. ధర తక్కువ ఉండటంతో పాటుగా, దిగుబడి కూడా అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. అనుమతులు లేని ప్రైవేట్ విత్తనాల కంపెనీలు రైతులను ప్రలోభాలకు గురిచేస్తూ, నాసిరకం విత్తనాలు అమ్ముతున్నాయన్నారు. సహకార సంఘాలు, మహిళా సంఘాలు విత్తన సంస్థ యొక్క విత్తనాలు రైతులకు అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో నిర్మల్, ఆదిలాబాద్ వ్యవసాయ శాఖ అధికారులు అంజి ప్రసాద్, శ్రీధర్, డిఆర్డిఓ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ లు భీమ్ రెడ్డి, అబ్దుల్ హాది, ఆత్మ కమిటీ చైర్మన్ రామ్ రెడ్డి, ఇతర అధికారులు, విత్తన డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.