Take a fresh look at your lifestyle.

పార్టీ కోసం పని చేసే వాళ్లను పక్కనబెడితే సహించ-మాజీ మంత్రి జీవన్ రెడ్డి

 
 
– కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళతా
–  పార్టీ నిర్ణయాల్లో నా సూచనలు పరిగణలోకి తీసుకోవాలి
– ఏఐసీసీ కార్యదర్శి సవాంత్‍ తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి
–  జగిత్యాల ఎమ్మెల్యే, జీవన్ రెడ్డిల మధ్య సయోధ్య

ముద్ర, జగిత్యాల :

పార్టీ కోసం పని చేసే వాళ్లను పక్కనబెడితే కచ్చితంగా నిలదీస్తానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కుమార్.. కాంగ్రెస్ లో చేరానని ఒకసారి, చేరలేదని మరోసారి దోబూచలాడుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి బీ ఫామ్ లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ తనకు ఇచ్చిన 16 బీ ఫామ్ లో తొమ్మిది చోట్ల గెలిచామన్న జీవన్ రెడ్డి… అదే సంజయ్ కుమార్ కు 34 బీ ఫామ్ లు ఇస్తే 14 మాత్రమే గెలిచారని చెప్పారు. సంజయ్ పక్కన పెట్టిన 9 మంది ఇండిపెండెంట్లు కూడా గెలిచారని ఏఐసీసీ కార్యదర్శి సవాంత్‍ కు వివరణ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వర్గాల మధ్య కుర్చీలాట కాంగ్రెస్ పార్టీకి తలనొప్పి వ్యవహారంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని అధిష్టానం మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఏఐసీసీ కార్యదర్శి సవాంత్‍కు అప్పగించింది. దీంతో సవాంత్, మంత్రి అడ్లూరితో జీవన్ రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి పార్టీలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లారు. సంజయ్ కుమార్ పార్టీలో చేరిన తర్వాత.. తన వర్గీయులను పక్కనబెడుతూ తన వర్గానికి పెద్దపీట వేసుకుంటున్నారని ఆరోపించారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సంజయ్ ను కట్టడి చేయాలని కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సవాంత్ హామీ మేరకు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన జీవన్ రెడ్డి.. పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పార్టీ నిర్ణయాల్లో తన ఆలోచనలు, సూచనలు పరిగణలోకి తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. భేటీ అనంతరం మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని జీవన్ రెడ్డి చెప్పారన్నారు. పార్టీ నేతల్లో పొరపచ్చాలున్నప్పటికీ జగిత్యాలపై కాంగ్రెస్ జెండా ఎగురడం ఖాయమన్నారు.

Leave A Reply

Your email address will not be published.