ముద్ర,మోత్కూరు:
మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రతి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలను తిలకించడానికి మోత్కూరు పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. స్వామివారిని స్వామివారిని మోత్కూర్ పుర వీధుల గుండా రథంపై ఊరేగిస్తారు. డప్పు వాయిద్యాలతో కోలాటం ఆటపాట లతో ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. చివరి రోజు నిర్వహించే అగ్నిగుండాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఒకేసారి అగ్నిగుండాలు తొక్కే క్రమంలో ఇద్దరు వ్యక్తులు అగ్నిగుండాలలో పడడంతో స్థానికులు వెంటనే గమనించి వారిని ఆసుపత్రికి తరలించారు.

మజ్జిగ పంపిణీ
మోత్కూరు మున్సిపల్ కేంద్రం లోని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం (ఎన్ఆర్ఐ) యలగందుల సుజన వేణుధర్ దంపతుల సౌజన్యంతో ఆలయం వద్ద భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గుండగోని రామచంద్రు గౌడ్ ,సభ్యులు అరవింద రాయుడు, బయ్యని రాజు, గుండు శీను భక్తులు పాల్గొన్నారు
