Take a fresh look at your lifestyle.

​జనతా నగర్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు: పాల్గొన్న బండి రమేష్

​ముద్ర కూకట్‌పల్లి :

మతసామరస్యానికి ప్రతీకగా మూసాపేటలోని జనతా నగర్‌లో కాంగ్రెస్ నాయకుడు సలీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ హాజరయ్యారు.
​ఈ సందర్భంగా బండి రమేష్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హిందూ, ముస్లింలు సోదరభావంతో మతసామరస్యాన్ని చాటుతూ పండుగలను జరుపుకోవాలని సూచించారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గాలి బాలాజీ, సత్యం శ్రీరంగం, శేరి సతీష్ రెడ్డి, తూము వేణు, సంజీవరావు, గంధం రాజు, తూము మనోజ్ కుమార్, ప్రవీణ్, కృష్ణ రాజ్‌పుత్, సాయిబాబా చౌదరి, పొడుగు అప్పారావు మరియు ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.