Take a fresh look at your lifestyle.

విస్తరిస్తున్న శివారు ప్రాంతాలను మహానగరానికి ధీటుగా అభివృద్ధి చేస్తాం

  • రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట దిశగా ప్రణాళికలు
  • సమస్యలు లేని నియోజకవర్గంగా మహేశ్వరంను తీర్చిదిద్దుతాం
  • రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
  • మీర్పేట్, జల్పల్లి మున్సిపాలిటీలో సిసి రోడ్లు, భవనాల నిర్మాణాలకు శంఖుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

(ముద్ర – ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి) : విస్తరిస్తున్న హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలను మహానగరంతో సమానంగా శరవేగంగా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.శనివారం మహేశ్వరం నియోజకవర్గం, మీర్పేట్, జల్ పల్లి మున్సిపాలిటీలలో, మహేశ్వరం మండలం, కందుకూరు మండలంలో భూగర్భ వరద నీటి పైపు లైను, ఎస్సీ కమ్యూనిటీ హాల్, సిసి రోడ్డు, స్మశాన వాటికకు వెయిటింగ్ హాల్ నిర్మణాల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గంకి సంబంధించి రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు కావాల్సిన బడ్జెట్ ను ప్రభుత్వం నుండి అందేలా తన సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న మహేశ్వరం నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడుతామన్నారు. రాష్ర్టంలో మహేశ్వరం నియోజకవర్గాన్ని అభివృద్ధి లో అగ్రస్థానంలో నిలిచే విధంగా ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందన్నారు. తద్వారా జిల్లాలో మహేశ్వరంను సమస్య లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, కందుకూర్ అర్డీఓ, మహేశ్వరం ఎమ్మార్వో, కందుకూర్ ఎమ్మార్వో, మీర్పేట్ మున్సిపల్ కమీషనర్, జల్ పల్లి మున్సిపల్ కమీషనర్, సంబంధిత ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.