కోరుట్ల, ముద్ర;
కథలాపూర్ మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బుధవారం రోజు బిజేపి, కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు అనేక రోజులుగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వేగవంతంగా కొనుగోలు చేయాలని కోరుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటివరకు మండల కేంద్రంలో కేవలం రెండు లారీల మొక్కజొన్నలు మాత్రమే కొనుగోలు చేయడం జరిగింది. రైతులు అనేక కష్టాల తో మొక్కజొన్న పంటను పండిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలలో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయవలసి ఉండగా ఆలస్యం కావడంతో రైతులు ఇతర వ్యాపారులకు, దళారులకు మొక్కజొన్న అమ్ముకోవడం జరిగింది. దాదాపు 1800 రూపాయలకు మాత్రమే మొక్కజొన్న విక్రయించడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎమ్మార్పీ ధర 2400 ఉండగా దాదాపు రైతు ఎకరానికి 15000 నుండి 20వేల రూపాయలు నష్టపోవడం జరిగింది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం వానాకాలంలో నవంబర్, డిసెంబర్ లో అలాగే వేసవికాలంలో మార్చి నెల నుండి మే నెల వరకు మొక్కజొన్న కొనుగోలులను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి ఎలాంటి కటింగు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రైతులతో కలిసి భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షులు కోడిపల్లి గోపాల్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపల్లి గోపాల్ రెడ్డి, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు మల్యాల మారుతి, రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు రాచమడుగు వెంకటేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ నాయకులు గాంధారి శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.