ముద్ర ప్రతినిధి, భువనగిరి: వార్తల సేకరణలో ముద్ర దినపత్రిక తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి ముద్ర దినపత్రిక 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా సంక్షేమ పథకాల అమలుపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రచురిస్తూ ముందు వరుసలో ముద్ర పత్రిక ఉందన్నారు.
ముద్ర పత్రిక యాజమాన్యానికి, పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ పర్యవేక్షణాధికారి మందడి ఉపేందర్ రెడ్డి, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్ ప్రసాద్, ముద్ర పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎలిమినేటి ఇంద్రారెడ్డి, జిల్లా ప్రతినిధి గుర్రాల శివనాగేందర్, పాత్రికేయులు నోముల నర్సిరెడ్డి, సూరారం నర్సింహా, పల్లె నరేష్ గౌడ్, మిర్యాల వెంకటేష్ పాల్గొన్నారు.