- ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సైన్స్ ల్యాబ్ తో విద్యార్థులకు మెరుగైన విద్య లభిస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్లో పీఎం శ్రీ నిధులు రూ.13.50 లక్షలతో సైన్స్ ల్యాబ్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సైన్స్ ల్యాబ్ తో విజ్ఞాన సముపార్జన జరుగుతుందనీ అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యానికి పెద్ద పీట వేశారని,జగిత్యాల జిల్లా కేంద్రంలో వైద్యం వైద్య పై ప్రత్యేక దృష్టి సారించి అత్యధిక నిధులు తీసుకొరావడం జరిగిందని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పల్లె దవాఖానాలు జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నాయన్నారు.ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో 5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు.సైన్స్ ల్యాబ్ ఏర్పాటుతో విద్యార్థులకు నాణ్యమైన బోధన, కొత్త ప్రయోగాల నాందికి, నూతన ఆలోచనకు దోహదపడతాయన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము నాయక్, ఎంఇవో భీమయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, సుధాకర్, డిష్ జగన్, తోట మల్లికార్జున్, క్యాదసు నవీన్,మేక పవన్, హెడ్ మాస్టర్ రామానుజం, ఏఇ ధనుంజయ్, ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆనంద్ రావు, దేవయ్య, ప్రభాత్ సింగ్ ఠాగూర్, దుమాల రాజ్ కుమార్, శరత్ రావు, ములసపు మహేష్, పవన్, రంగుమహేష్, రామకృష్ణ రెడ్డి, ఏనుగుల రాజు, చిట్ల మనోహర్, శశి, రవి శంకర్,ఉపాధ్యాయులు,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
