Take a fresh look at your lifestyle.

విద్య వ్యాప్తికి అపార కృషి చేసిన పూలే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

 

మహాదేవపూర్ ముద్ర:

సమాజంలో సమానత్వ స్థాపనకు, విద్యా విస్తరణకు అపార కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతి బా పూలే అని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివారం ఐడిఓసి కార్యాలయంలో మహాత్మా జ్యోతి బా పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, మహాత్మా జ్యోతి బా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, బిసి అభివృద్ధి అధికారి ఇందిర, బీసీ సంఘాల ప్రతినిధులు సత్యనారాయణ, తిరుమల చారి, భద్రయ్య, సంపత్, సతీష్, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.