Take a fresh look at your lifestyle.

నకిలీ విత్తన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి

  • డీజీపీకి బీజేపీ ఎస్టీ మోర్చా ఫిర్యాదు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : నకిలీ విత్తనాలను అంటగట్టి రైతులను మోసం చేసిన విత్తన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్‌కు బీజేపీ ఎస్టీ మోర్చా నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ నేతృత్వంలోని బీజేపీ నేతల బృందం డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించింది. అనంతరం కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ.. ములుగు జిల్లా వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతాల్లో నకిలీ విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోయిన గిరిజన రైతులకు న్యాయం కల్పించాలని డీజీపీని కోరామన్నారు. గత కొద్ది నెలలుగా సింజాంటా, హైటెక్, బాయేర్, సిబి వంటి కంపెనీలు నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.