కోరుట్ల, ముద్ర: మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ ఆదేశాల మేరకు న్యూస్ పేపర్ లో వచ్చిన కథనం ప్రకారం, పట్టణ ప్రజల ఫిర్యాదుల మేరకు, రెస్టారెంట్ పై దాడులు నిర్వహించారు.నిల్వ ఉన్న ఆహార పదార్థాలను స్వాధీనపరచుకొని వారు వినియోగించు నూనె,పాత్రలు పరిశీలించారు.శుభ్రంగా లేకపోవడంతో 10 వేల రూపాయలు జరిమానాలు విధించడంతో పాటు, బట్ట సంచులను వాడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ క్రాంతి కుమార్,సానిటరీ ఇన్స్పెక్టర్ బాలే అశోక్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిస్థాయిలో నిషేధించాలని,హోటల్స్,రెస్టారెంట్ లను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. దుకాణదారులందరూ విధిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని లేనియెడల భారీ జరిమానాలు విధించడంతో పాటు వాటిని సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు.