Take a fresh look at your lifestyle.

అప్పులు.. తప్పులే కొంపముంచాయి అది ఆవేదనా సర్వం

  • సీఎం రేవంత్ వ్యాఖ్యలను సమర్పించిన మంత్రి శ్రీధర్ బాబు.
  • ప్రజలకు రాష్ట్ర అప్పుల సంగతులన్నీ తెలియాలి.
  • గత ప్రభుత్వం చేసిన అప్పులు.
  • ఆర్థిక తప్పిదాల కారణంగా ఇప్పుడు సమస్యలు.
  • వాళ్లు చేసిన తప్పులకు ఈ ప్రభుత్వం బాధలు పడుతుంది.
  • హెలికాప్టర్​ అద్దెకు తీసుకుని తిరిగింది వాళ్లే కదా.
  • ఉద్యోగుల పట్ల మా ప్రేమ వాస్తవం.
  • మావోయిస్టుల కారణంగా మేం చాలా నష్టపోయాం.
  • అయినా శాంతికి అవకాశం ఇవ్వాల్సిందే.
  • మీడియాతో మంత్రి శ్రీధర్​ బాబు చిట్​చాట్​.

ముద్ర, తెలంగాణ బ్యూరో : గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఆర్థిక తప్పిదాల కారణంగా ఇప్పుడు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.సీఎం రేవంత్​ ముక్కుసూటిగా మాట్లాడారని, ఆయన మాటలను ఆవేదనగా భావించాలని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, విపక్షాల విమర్శలు తదితర అంశాలపై మంత్రి శ్రీధర్​ బాబు మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.ఒకరి తప్పులు.. మరొకరి బాధలుగా మారాయన్నారు.గత ప్రభుత్వ తప్పిదాలతో రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభానికి గురైందని, సీఎం ఆవేదన వ్యక్తం చేయడంలో తప్పు లేదని, కేవలం ప్రజా సంక్షేమం కోసం మాట్లాడారే తప్ప మరో ఉద్దేశం కాదన్నారు. అప్పుల భారం, ఉద్యోగుల జీతాల కష్టాలు, కార్పొరేషన్ అప్పులు వంటి అన్నింటికీ ప్రధాన కారణాలు గత ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. మంత్రులు హెలికాప్టర్లలో తిరుగుతున్నారంటూ ఏవో మాట్లాడుతున్నారని, ఇప్పుడు హెలికాప్టర్​ను కూడా అద్దెకు తీసుకున్నదే బీఆర్​ఎస్​వాళ్లన్నారు. వాళ్లు ఎటు తిరిగారో కానీ.. మేం మాత్రం ప్రయోజనాత్మకంగా జిల్లాలకు వెళ్తున్నామని, గతంలో వాళ్ల ఖర్చుతో పోలిస్తే ఇప్పుడు మేం చేస్తున్న ఖర్చు కూడా తక్కువే అన్నారు.ప్రభుత్వానికి అవసరమైన సమయంలో హెలికాప్టర్ వాడడం, ఖాళీగా ఉండడం కంటే మంచిదని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై గత ప్రభుత్వం ప్రభావాన్ని వెలికి తీస్తూనే, ప్రస్తుత ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రజలకు వివరించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

  • అవేం విమర్శలు కాదు

కొన్ని అంశాలను ప్రజలకు వివరించాలంటే నేరుగా మాట్లాడాల్సిందేనని, సీఎం రేవంత్ రెడ్డి ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అని, ఆయన విషయాలను ఉన్నది ఉన్నట్టుగా చెప్తారని, అందువల్ల ఆయనపై అనవసరమైన ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు.గత ప్రభుత్వ ఆర్థిక తప్పిదాలను సరిచేస్తున్నామని సీఎం చెప్పడం, రాష్ట్రానికి అవసరమైన మార్పులు తీసుకురావడంలో ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.“ప్రజా సంక్షేమం కోసం ఆలోచించి మాట్లాడారు సీఎం.చిన్నాభిన్నం చేసిన ఆర్ధిక విధానం చూసి ఆవేదనతో మాట్లాడారు. నేను ఇచ్చిన మాట ప్రకారం అన్ని పనులు చేయాలి.డబ్బులు లేవు అనే ఆవేదన సీఎం లో ఉంది. బీఆర్ఎస్ వాళ్లకు పేగు బంధం ఉంటే జీతాలే సరిగా వేయలేదు. వాళ్లకు ప్రేమ ఉన్నట్టా..? మేం రాగానే డీఏ ఇచ్చాం.వాళ్ళలాగా మేము వదిలేయలేదు. కార్పొరేషన్ పేరుతో తెచ్చిన అప్పులు కూడా ప్రభుత్వమే కడుతుంది. కేటీఆర్.. ప్రభుత్వం చేసిన అప్పుల గురించే మాట్లాడుతున్నారు” అని మంత్రి వ్యాఖ్యానించారు.
రాష్ట్రాన్ని దివాళా తీయించింది కేసీఆర్ అని.. దాని నుంచి బయట పడేసే పని తాము చేస్తున్నామని శ్రీధర్ బాబు అన్నారు. “సెక్రటేరియట్ హోం ఐతే.. వాళ్ళు ఉండేది ఫార్మ్ హౌసా..? ఉద్యోగస్తులు మా సోదరులు.. మా మిత్రులే. ఆలస్యం అయినా.. అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం. తెలంగాణ లోనే కాదు..దేశ వ్యాప్తంగా ఆర్ధిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది.అయినా.. వనరులు పెంచి.. నిధులు తెచ్చే పనిలో ఉన్నాం.లక్ష కోట్లు తెచ్చు కాళేశ్వరంలోనే పెట్టారు కేసీఆర్. సీఎం..ఈ వ్యవస్థ గురించి ప్రజలకు తెలియాలి అని చెప్పారు. అప్పులు..చెప్పకపోతే ప్రజలకు తెలియాలి కదా.రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్ ఇవ్వలేక.. కేసీఆర్ ఉద్యోగుల పదవి కాలాన్ని పెంచారు.కానీ మేము యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాం.” అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మవోయిస్టుల ఎన్‌కౌంటర్లపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు.మావోయిస్టుల తో మా కుటుంబానికి అన్యాయం జరిగింది.కానీ ఇంకో కుటుంబానికి అన్యాయం జరగొద్దు అనేది మా ఆలోచన. శాంతి చర్చలు కోరడం తప్పు కాదు. మా ప్రభుత్వమే గతంలో మావోయిస్టుల తో చర్చ చేసిందని గుర్తు చేశారు.

  • ఎందుకు బీజీపీ దిగాలంటుంది.

బీజేపీ ప్రభుత్వంపై మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు చేస్తూ, ఈ పార్టీకి పాలించే అర్హత ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఏ వ్యవస్థను కూడా హ్యాండిల్ చేయని బీజేపీకి పాలించే అర్హత ఎక్కడిదన్నారు.బీజేపీ వాళ్లు దిగి పోండి అంటున్నారని, బీజేపీ కేంద్రం లో పాలన చేతకాకపోతే దిగిపోవాలని, పెహల్గం వైఫల్యంకి దిగి పో అనాలా..? అని మంత్రి శ్రీధర్​ బాబు నిలదీశారు. బీజేపీ ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చారా..? మోడీ విదేశాలకు పోతే.. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయా..? అని ప్రశ్నించారు.ప్రభుత్వాన్ని ఒకరిద్దరు బెదిరించినట్టు మాట్లాడారు.దానికి హార్ట్ అయ్యి ఉంటారన్నారు.ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన అంశాలపై కూడా మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ, ఆమె బీఆర్ఎస్ స్ట్రాటజీ ప్రకారమే మాట్లాడుతుందన్నారు. బీఆర్ఎస్ నేతలెప్పుడూ మాకు ప్రత్యర్థులేనని, కుల గణన, ఎస్సీ వర్గీకరణ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం చేయడం లేదంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు.దీంతోపాటు స్మితా సబర్వాల్ పై తమకు ఎలాంటి కక్ష్య లేదన్నారు.తమకు అయినా, అధికారులకు అయినా కొన్ని నిబంధనలు ఉంటాయన్నారు.అందాల పోటీల ఖర్చుకు, ఉద్యోగస్థుల సమస్యకు ఏంటి సంబంధమని ప్రశ్నించారు. తెలంగాణ గురించి అనేక మందికి తెలియజేయాలనేదే సీఎం ఉద్దేశమని, ఈ క్రమంలో అందా పోటీల గురించి ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

  • ఉద్యోగులంటే మాకు ప్రేమ.

పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాల్సి వస్తుందని బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంచారని మంత్రి శ్రీధర్​బాబు గుర్తు చేశారు.తమకు ప్రభుత్వాన్ని నడిపే సత్తా ఉందో లేదో ప్రజలకి తెలుసని, ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలను, ఉద్యోగుల సంక్షేమాన్ని గుర్తు చేస్తుందన్నారు.అందాల పోటీలు కేవలం అందానికి సంబంధించినవి కాదన్నారు.వ్యక్తిత్వానికి సంబంధించినవని మంత్రి చెప్పారు.అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరుతెచ్చే అందాల పోటీలను గౌరవంగా భావించడం, రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకతను ప్రదర్శించడంలో సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.