Take a fresh look at your lifestyle.

విద్యుత్తు వెలుగులతో అభివృద్ధి చేసిన కూడలిని కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించిన పీయేసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ 

మాదాపూర్, ముద్ర: శేరిలింగపల్లి నియోజకవర్గం లోని ప్రతి  కూడలిని సుందర శోభిత వనంగా తీర్చిదిద్దుతామని, అభివృద్ధి చేసిన జంక్షన్ల ను ప్రారంభించుకోవడం చాలా  సంతోషకరంగా ఉందని పీయేసి చైర్మన్ గాంధీ  అన్నారు. శేరిలింగపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్ది తో కలిసి గచ్చిబౌలి, నల్లగండ్ల చౌరస్తా లో సుందరీకరణను ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ప్రారంభోత్సవం చేశారు.అన్ని హంగులు, సకల సౌకర్యాలతో కూడలి ని అభివృద్ధి చేయడం జరిగిందని ప్రజలు,వాహనదారులను, చూపరులను ఆకట్టుకునేలా అద్భుతంగా కూడలిలను తీర్చిద్దిద్దడం జరిగిందన్నారు.చక్కటి స్వచ్చమైన ఆహ్లాదకరమైన పచ్చదనంతో కూడిన కూడలిలను ఏర్పాట్లు చేయడం వల్ల పిల్లలు, వృధ్ధులు, ప్రజలు కాసేపు సేద తిరడానికి అనువుగా, కూర్చోడానికి వీలుగా బల్లలు ఏర్పాటు చేశామన్నారు.నియోజకవర్గంలో ప్రతి కూడలి ని సుందర శోభిత వనంగా తీర్చిదిద్దుతామని  చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు,మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.