Take a fresh look at your lifestyle.

క్రీడలతో మానసిక వికాసం పెంపొందుతుంది : రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
క్రీడలతో మానసిక వికాసం పెంపొందుతుందని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల అన్నారు. భువనగిరి పార్లమెంట్ వ్యాప్తంగా ఇటీవల పీఎం సంసద్ ఖేల్ మహోత్సవంలో భాగంగా జరిగిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రధానం చేయడానికి ఆదివారం జూనియర్ కళాశాల మైదానంలో సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు దేశంకు యువత నిర్మాణాత్మకంగా పనిచేయుటకు ఉపయోగపడతాయన్నారు.
ప్రధానమంత్రి సంసత్ ఖేల్ మహోత్సవంలో 1,520 వేల మంది యువత ఆడడం సంతోషకరమన్నారు.
తెలంగాణ గవర్నర్ అయిన తర్వాత ఇది నా మొదటి కార్యక్రమం అని చెప్పారు.


క్రీడలు అనేవి దేశం కు యువత నిర్మాణాత్మకంగా పనిచేయుటకు  క్రీడలు చరిత్ర నిర్మాణము, టీం స్పిరిట్ నీకు దోహ చేస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టి క్రీడలను ప్రోత్సహించడంతో నాగరికత అవిశ్వాసము పెంపొందుతుందన్నారు.


క్రీడల వల్ల ఫిట్ ఇండియా  శరీరము ఆత్మ శుద్ధి చెందుతుందన్నారు.
రానున్న రోజులలో తెలుగులో నేర్చుకుని మాట్లాడుతాని చెప్పారు. క్రీడల వల్ల వికసిట్ భరత్ లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ముందుగా గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు బూర నర్సయ్య గౌడ్, గూడూరు నారాయణ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్, అధ్యక్షులు రత్నపురం బలరాం, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.