ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి: ఒకే దేశం ఒకే ఎన్నికపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భాజపా రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దుర్గాప్రసాద్ అన్నారు. బుధవారం కల్వకుర్తి పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఒకటే దేశం ఒకటే ఎన్నికలు పై బిజెపి నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు.దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగడం వలన కలిగే లాభాలపై ప్రజల్లో అవగాహన కల్పించుటకు కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఓకే దేశం ఒకే ఎన్నిక కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు పథకాలను అమలు చేస్తుందన్నారు. సమావేశంలో కాశ్మీర్ లో వీరమరణం పొందిన పర్యాటక హిందువులకు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేయడం జరిగింది జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బండెల రామచంద్రారెడ్డి, కృష్ణ గౌడ్, బిజెపి పట్టణ అధ్యక్షులు బాబీ దేవ్, మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్,రవి గౌడ్, సురేందర్ గౌడ్, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.