Take a fresh look at your lifestyle.

హాస్టల్ వార్డెన్స్ స్థానికంగా నివాసం ఉండాలి

  • పేద విద్యార్థులకు విద్య,సంస్కారం, లక్ష్యాలను చెరుకోనె ధైర్యం ,నేర్పించే బాధ్యత హాస్టల్ సంక్షేమ అధికారులదే.
  • హాస్టల్ సంక్షేమ అధికారులు విధులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు.
  • ప్రతి హాస్టల్లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించారు.
  • జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.

ముద్ర ప్రతినిధి, సూర్యపేట: హాస్టల్ సంక్షేమ అధికారులు స్థానికంగా నివాసం ఉంటూ బాధ్యతగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశం మందిరం నందు అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలసి జిల్లాలోని ఎస్ సి, ఎస్ టీ, బి సి హాస్టల్స్ సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం తీసుకున్న చర్యలు, ఆదేశాల వల్ల మెరుగైన ఫలితాలు సాధించామని గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం హాస్టల్స్ లో అడ్మిషన్స్ పెరిగాయని క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అందించామని అందుకుగాను ఫలితాలు సాధించిన వార్డెన్స్ కు అభినందనలు తెలిపారు. సంక్షేమ హాస్టల్స్ అంటే వసతి కాదని, కేవలం చదువుకోడానికి మాత్రమే ఉన్న ప్రభుత్వం కల్పించిన విద్యా మందిరం అని, గత సంవత్సరం సంక్షేమ హాస్టల్స్ లో 96% ఎన్రోల్మెంట్ తో 5,300 అడ్మిషన్స్ జరిగాయని, ఈ సంవత్సరం 10,000 అడ్మిషన్స్ దాటిపోయాయని కలెక్టర్ అన్నారు. సంక్షేమ హాస్టల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, శానిటేషన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ముఖ్యమైన అంశాలని వీటిని ప్రతి ఒక్క హాస్టల్ సంక్షేమ అధికారి పాటిస్తూ సూచనలకి అనుగుణంగా సేవలు అందించాలని, ప్రతి హాస్టల్ సంక్షేమ అధికారి స్టాక్ రిజిస్టర్ నిర్వహించాలని, అన్ని రికార్డులు నీటుగా ఉండాలని, ప్రతి ఒక్క విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యార్థి యొక్క నడవడికలను, ప్రవర్తనలను గమనిస్తూ ఉండాలని, హాస్టల్స్ లో ర్యాగింగ్, మత్తు పదార్థాల వాడకం, సుదీర్ఘకాలం ఆబ్సెంట్ ఉంటే, ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తే అలాంటి విద్యార్థులను అడ్మిషన్ రద్దు చేయవచ్చని అన్నారు. వంట గదిలో వైట్ వాష్ వేయించాలని, లివింగ్ ఏరియా శుభ్రంగా ఉండాలని, వాష్ ఏరియా క్లీన్ గా ఉంచుకోవాలని అన్నారు. ఫ్లోర్ క్లీన్ గా ఉండాలని అవసరం అయితే బ్లీచింగ్ పౌడర్ తో క్లీనింగ్ చేయించాలని, విద్యార్థుల దుస్తులు కూడా నీట్ గా ఉండాలని, విద్యార్థులకు హెయిర్ కటింగ్ చేయించాలని, మెనూ ప్రకారం భోజనం అందించాలని, సమయపాలన పాటించాలని,బాలికల హాస్టల్ లో శానిటేషన్ ప్యాడ్స్ అందుబాటులో ఉంచాలని, బాత్రూం తలుపులు సరిగా ఉండాలని, ఓవర్ హెడ్ ట్యాంక్ క్లీనింగ్ చేయాలని, డ్రింకింగ్ వాటర్ ప్రతిరోజు వచ్చే విధంగా చూడాలని విండోస్ ఉండే విధంగా చూసుకోవాలని కలెక్టర్ అన్నారు. సంక్షేమ హాస్టల్ లో ఏమైనా రిపేర్లు, సమస్యలు, సిబ్బంది కొరత ఉంటే తన దృష్టికి తీసుకొనిరావాలని, అలా కాకుండా హాస్టల్స్ తనిఖీకి వచ్చినప్పుడు కారణాలు చెప్పి తప్పించుకుంటే చర్యలు తప్పవని అన్నారు. ప్రతి ఒక్క సంక్షేమ అధికారి పి పి టి తయారు చేసుకొని మరల జరుగు సమావేశములకు రావాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎస్ సి సంక్షేమ అధికారి దయానందరాణి, ఎస్ టీ సంక్షేమ అధికారి శంకర్ నాయక్, బి సి సంక్షేమ అధికారి శ్రీనివాస్ నాయక్, జిల్లాలోని హాస్టల్ సంక్షేమ అధికారులు, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.