ప్రమాణ స్వీకారం చేసిన రెండు గంటలకే కౌన్సిల్ పదవికి రాజీనామా
చైర్మన్ ఎంపికలో బీసీలకు అన్యాయం అని ఆరోపణ
ముద్ర, వనపర్తి:
వనపర్తి మున్సిపల్ కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేసిన రెండు గంటలకే తమ పదవికి రాజీనామా చేసిన సంఘటన వనపర్తిలో సంచలనం రేపింది. మున్సిపల్ చైర్మన్గా మాధవి ప్రమాణం స్వీకారం అనంతరం చైర్మన్ ఎన్నికలో బీసీలకు అన్యాయం జరిగిందని, రాజకీయంగా కౌన్సిల్లో ఎలాంటి అనుభవం లేని వ్యక్తికి చైర్మన్ పదవి కట్టబెట్టి డమ్మీ చేసి అధినేతలు ఆడుకోవడానికి పావుగా వాడుకుంటున్నారని మూడవ వార్డు నుండి గెలుపొందిన కౌన్సిలర్ చీర్ల రజిని ఆరోపించారు. పార్టీని నమ్ముకుని తమ కుటుంబం ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన గుర్తింపు దక్కలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఎలాంటి అనుభవం లేకున్న కేవలం వారి వెనుక ఉన్న డబ్బుకు ప్రాధాన్యత ఇస్తూ ఆమెను చైర్మన్ సీట్ లో కూర్చోబెట్టారని అన్నారు. కౌన్సిల్లో అత్యధిక మంది కౌన్సిలర్లు బీసీలు ఉన్నప్పటికీ చైర్మన్ పదవి దక్కకపోవడం ఆవేదనను కలిగించిందని, అందుకు నిరసనగా తన కౌన్సిల్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి, ఎన్నికల అధికారి, ఆర్డీవోకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Next Post