Take a fresh look at your lifestyle.

అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డులు – టి యు డబ్ల్యూ జే ఐ జె యు సభ్యత్వ నమోదు ప్రారంభం

 

ముద్ర, తుంగతుర్తి…
అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు అందుతుందని రిపోర్టర్ ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీయూడబ్ల్యూజే ఐజేయు యూనియన్ జిల్లా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు శంకరమంచి రవీందర్ శర్మ అన్నారు. శనివారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో యూనియన్ సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే ఐ జే యు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చలసాని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై టియుడబ్ల్యుజే అనేక ఉద్యమాలు చేసిందని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి యూనియన్ ఎంతో కృషి చేసిందని అన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులను అందజేయడానికి యూనియన్ కృషి చేస్తుందని అన్నారు. రానున్న కాలంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి యూనియన్ ఇంకా కృషి చేస్తుందని అన్నారు. మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు గా ఎన్నికైన రవీందర్ శర్మను ప్రెస్ మిత్రులు సన్మానించారు ఈ సందర్భంగా యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాత్రికేయులు పూసపెల్లి యాదగిరి, వడ్లకొండ శ్రీనివాస్, తాళ్లపల్లి సోమన్న, ఆకారం ఎల్లయ్య, కోదాటి విక్రం రావు, ఓరుగంటి శ్రీనివాస్, ఎండి మజీద్, అండెం సైదులు లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.