Take a fresh look at your lifestyle.

ఘనంగా మాజీ పార్లమెంటేరియన్ కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి వర్ధంతి 

 

తుంగతుర్తిలో బి ఎన్ స్తూపం వద్ద నివాళులర్పించిన పలువురు నాయకులు

ముద్ర ,తుంగతుర్తి…

తెలంగాణ సాయుధ పోరాట యోధులు, మాజీ ఎంపీ ,మాజీ ఎమ్మెల్యే  కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి  18వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా శనివారం తుంగతుర్తి లో బి ఎన్ స్థూపం వద్ద ఆయన అభిమానులు ఘనంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య మాట్లాడుతూ నిస్వార్థ త్యాగజీవి కామ్రేడ్ భీమిరెడ్డి అని కొనియాడారు.

భూస్వాముల ,పెత్తందారుల, నిజాం రజాకారుల వెట్టిచాకిరి నుండి, ప్రజలకు విముక్తి కలిగించి లక్షలాది ఎకరాలభూమిని పేదలకు పంచిన ఎర్రజెండా ముద్దుబిడ్డ బి ఎన్ అన్నారు ఎస్సారెస్పీ రెండవ దశ కాలువ సాధించిన గొప్ప నాయకుడు భీమిరెడ్డి అన్నారు. వారి త్యాగాలను కృషిని భవిష్యత్ తరాలకు తెలియచేయాల్సిన బాధ్యత మనందరిమీద ఉందనీ అన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కోట రామస్వామి మాజీ ఎంపీటీసీ గుండగానీ దుర్గయ్య. ఉప్పల సోమయ్య. మహేందర్. రామకృష్ణ. దశరథ. పూసపెల్లి యాదగిరి. మట్టిపెల్లి లింగయ్య. వెలుగు నర్సయ్య. మనోజ్.. ఓరుగంటి శ్రీనివాస్ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.