Take a fresh look at your lifestyle.

తమ స్థలం తమకు ఇవ్వాలి అంటూ మహిళల ఆత్మహత్యాయత్నం

 

ముద్ర, బండ్లగూడ: రెక్కలు ముక్కలు చేసి కూడా పెట్టిన డబ్బుతో కొన్న తమ స్థలాన్ని అక్రమంగా కబ్జా చేస్తున్నారంటూ మహిళలు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదర్ షాకోట్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… హైదర్ షాకోట్ గ్రామంలో నివాస ఉండే జంగారెడ్డి, పావని రెడ్డి దంపతులు 2019లో హైదర్ షా కోట పరిధిలోని 15/1 సర్వే నెంబర్లు 306 గజాల స్థలాన్ని కొన్నారు. ఆ తర్వాత భూమి పూజ చేసి డబ్బులు ఇబ్బంది ఉండటంతో కట్టడం ప్రారంభించలేదు. అయితే 18/4 సర్వే నెంబర్ లోని స్థలం తమది అంటూ మాజీ కార్పొరేటర్ రవి యాదవ్, సలాం అనే వ్యక్తితో రెండు సంవత్సరాల క్రితం విరి పక్కన స్థలంలో కబ్జాకు దిగారు. పక్కనే జంగారెడ్డికి సంబంధించిన ప్లాటు ఖాళీగా ఉండడంతో ఆ స్థలాన్ని కూడా కబ్జా చేశారు. రెండు సంవత్సరాలుగా తమ స్థలాన్ని తమకు అప్పగించాలని వేడుకున్న వారు వినలేదు. దీంతో బుధవారం పావని రెడ్డి, వాణి రెడ్డి అక్కడికి చేరుకొని తమ అత్త ఆకుకూరలు అమ్మి కూడబెట్టిన డబ్బుతో ఈ స్థలం కొన్నామన్నారు. తమ స్థలం తమకు అప్పగించాలంటూ అక్కడ ఆత్మహత్యాయత్నం చేశారు. హుటాహుటిన స్థానికులు వారిని ఆపగా సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు అక్కడికి చేరుకొని సముదాయించారు. అయితే రవి యాదవ్ చెపుతున్న 18/4 సర్వే నెంబర్ ఆర్మీలో, ఎర్రగుంట చెరువులో, చేవెళ్ల ప్రధాన రహదారిలో ఉందని గతంలో వేరే కేసుల్లో కోర్టులు అతనికి తెలిపారు. గతంలో కూడా రవి యాదవ్ , హైదర్ షాకోట్ పరిధిలో చెరువు కబ్జాయత్నం చేయడంతో పాటు, హైదర్ షాకోట్ నరసింహారెడ్డి కి సంబంధించిన స్థలాన్ని కూడా కబ్జాయత్నానికి ప్రయత్నించారని బాధితులు ఆరోపించారు. వెంటనే తమ స్థలాన్ని తమకు అప్పగించాలని కోరుతూ బాధితులు రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు.

Leave A Reply

Your email address will not be published.