మంథని, ముద్ర: మంథని మండలంలోని కాకర్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కనవేన ఓదెలు ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెల్ల రేషన్ కార్డు దారులకు పంపిణీ చేస్తున్న సన్నరకం బియ్యం పై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు.అనంతరం కాంగ్రెస్ నాయకులు మెండె రాజయ్య మాట్లాడుతూ ఐటి పారిశ్రామల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉండి ప్రజలకు ఆరు గ్యారంటీలో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పేద ప్రజలకు సన్న బియ్యం,రెండు పూటలా కడుపునిండా అందించే విధంగా, సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల బాగోగులు చూస్తోందన్నారు.ఎక్కడా రాజీలేకుండా దశల వారీగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందింస్తూ అభివృద్ధి దిశలో ముందుకు సాగుతోందిని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు భాస్కర్ల శంకర్, తన్నీరు లక్ష్మన్,అకుల మల్లయ్య,ఇసంపెళ్లి మహేందర్,చెవుల బాపు,ఎలగందుల రవి,భాస్కర్ల రాజయ్య,ఎలక్కుర్తి కత్తన్న,వర్షబోయిన రాజయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలగందుల వెంకటేష్,ఉపాధ్యక్షులు ఎలకుర్తి మహేష్,యూత్ కాంగ్రెస్ నాయకులు గుంటుకు గణేష్,బడుగు సతీష్ తదితరులు పాల్గొన్నారు.