Take a fresh look at your lifestyle.

ప్రపంచ సైక్లింగ్ పోటిలో సత్తా చాటాలని యువకుని పట్టు 

వలిగొండ, ముద్ర: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల ముద్దుబిడ్డ వృత్తిరీత్యా ఐర్లండ్ లొ స్థిరపడిన మానవతావాది కోలన్ కమలాకర్ జ్యోతి రెడ్డి దంపతుల కుమారుడు కోలన్  దేవాన్ష్ రెడ్డి డెన్మార్క్ లొని కోపెన్ హాగెన్ లో జులై ఇరువై ఎనిమిది నుండి ఆగస్ట్ రెండు వరకు  జరుగుచున్న 2025 బి ఎం ఎక్స్ రేసింగ్ యుసిఐ ప్రపంచ సైక్లింగ్  ఛాంపియన్ లో ఐర్లాండ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, చిన్న వయసులో విశేష ప్రతిభ కనపర్చిన దేవాన్ష్ రెడ్డి కి ఐర్లాండ్ ప్రధానమంత్రి లియో వరాద్కర్ చేత ప్రశంసలు అందుకున్నారని,పాఠశాలలో 2023 విద్య సంవత్సరముకు స్పోర్ట్స్ లో విశేష ప్రతిభ ధైర్యసాహలతో కాన్ఫిడరేషన్ ఆఫ్ కమ్యూనిటీస్ ఇన్ ఐర్లాండ్  పోటిలో గొప్ప అవార్డు అందుకున్నారని,మరింత కృషితో ప్రపంచ  చాంపియన్ గా పేరునిలుపుకోవటం అది ఒక దేవాన్ష్ రెడ్డి కే సాధ్యమైందని,అంతర్జాల మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న పులిగిల్ల ప్రజలంత చిన్న వయసులోనే విశ్వప్రపంచంలొ గొప్పపేరు తెస్తున్నా కోలన్ దేవాన్ష్ రెడ్డి విజేత గా గెలుపొందాలని ఆశిస్సులు అందిస్తూ, ఉన్నతాశయంతో కుమారునికి ఉజ్వల భవిష్యత్ అందిస్తూ పుణ్య పులిగిల్ల పేరును ప్రపంచ వ్యాప్తంగా వినిపించి, నేటి యువతీయువకులకు ఆదర్శముగా నిలుస్తున్న కోలన్ కమలాకర్ రెడ్డి జ్యోతి దంపతులకు మరియు కుటుంబ సబ్యులకు చేయూత ఫౌండేషన్ చెర్మన్ వాకిటి రామ్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియచేశారు. మరియు బంధుమిత్రులు కుటుంబ సబ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.