Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లుల విడుదలకు చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

కశిరెడ్డి నారాయణ రెడ్డి ఈరోజు హౌసింగ్ మరియు రెవెన్యూ శాఖల మంత్రుల అధ్యక్షతన నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులపై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల సమస్యలను ఎమ్మెల్యే పాయింట్‌వైజ్‌గా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, వాటిని త్వరితగతిన విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా బిల్లుల చెల్లింపులు వేగవంతం చేయాలని కోరారు.

అలాగే ఆమనగల్ పట్టణంలో ఏసీపీ కార్యాలయం, సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం సహా పలు ప్రభుత్వ భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో నూతన ఎమ్మార్వో కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన స్థలాలు మరియు నిధులను కూడా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వాకిటి శ్రీహరి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.