- సీఎం రేవంత్ కు ఆహ్వానపత్రిక అందజేసి మంత్రి సురేఖ
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈనెల 13 నుంచి జరిగే ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రావల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానపత్రికను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో, సిబ్బంది స్వామి వారి తీర్థప్రసాదాలను అందించి, శేష వస్త్రాలతో సత్కరించగా, ఆలయ అర్చకులు సీఎం రేవంత్ రెడ్డి కి వేదాశీర్వచనం అందించారు. జానపదుల జాతరగా ఖ్యాతికెక్కిన ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాల వైభవాన్ని, దేవాలయ చారిత్రక నేపథ్యాన్ని, ఆలయ ప్రాశస్త్యాన్ని ఆలయ సిబ్బంది, అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.