Take a fresh look at your lifestyle.

అంతా వాళ్లకే తెలుసు …. ఫార్ములా కేసులో అధికారుల విచారణ

  • బీఎల్​ఎన్​ రెడ్డిని విచారించిన ఈడీ
  • అంతా అరవిందుకు తెలుసన్న మాజీ సీఈ
  • ఐవోబీ ద్వారా ఫారిన్​ కరెన్సీ ట్రాన్స్ ఫర్
  • ఈడీ ముందు చెప్పిన బీఎల్​ఎన్​ రెడ్డి
  • కేటీఆర్​ ఆదేశాలతోనే బదిలీ
  • ఏసీబీ ముందు అరవింద్​ కుమార్​
  • మంత్రి చెప్తే గుడ్డిగా చేస్తారా అంటూ ప్రశ్నించిన ఏసీబీ
  • కారు రేసింగ్​ కోసం కాకుండా.. ఇంకా నిధులు వేటికి రిలీజ్​ చేశారంటూ ప్రశ్నించిన ఏసీబీ టీం
  • కీలక విషయాలు వెల్లడించిన ఐఏఎస్​ అరవింద్​

ముద్ర, తెలంగాణ బ్యూరో :- ఫార్ములా ఈ …కారు రేసులో విచారణ చేపట్టిన ఈడీ, ఏసీబీ అధికారులు సంధిస్తున్న ప్రశ్నలకు వరుస ప్రశ్నలు సంధించడంతో విచారణకు హాజరైన అధికారులు ఉక్కిరి, బిక్కిరికి గురయ్యారు. ఒక దశలో అయితే తాము నిమిత్ర మాత్రులమని….అంతా పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే చేశామని అంగీకరించాలని తెలుస్తోంది. ఈ కేసులో అప్పటి పురపాలక శాఖ ప్రత్యేకకార్యదర్శి అరవింద్ కుమార్ (ఐఏఎస్) ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరుకాగా….ఈడీ కార్యాలయంలో జరిగిన విచారణలో మాజీ సీఇ బీఎల్ఎన్ రెడ్డి పూసగుచ్చినట్లుగా చెప్పినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా ఆయన స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేశారు.

ఏసీబీ కార్యాలయంలో కూడా అరవింద్ కుమార్ పై ఏసీబీ అధికారుల కురిపించడంతో ఒకింత షాక్ కు గురైనట్లుగా సమాచారం. విచారణ సందర్భంగా ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో రూ.55 కోట్లు విదేశీ కంపెనీకి బదిలీ చేయడం వెనుక ఉన్న అసలు కోణాలు ఏంటి? అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే ఈ డబ్బులను రిలీజ్ చేశారా.. ? అసలు జరిగిందేమిటీ? తదితర అంశాలపై ఏసీబీ అధికారులు ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా రూ.55 కోట్లు ఎఫ్‌ఈవో సంస్థకు చెల్లించిన నేపథ్యంలో విదేశీ కంపెనీకి నగదు బదిలీ వెనుక ఉన్న అసలు కోణం ఏంటి.. ఇది ఎవరి నిర్ణయం… నగదు బదిలీకి ఆర్బీఐ అనుమతి ఉందా? అంటూ అరవింద్ కుమార్‌కు స ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ప్రశ్నలకు అరవింద్ కుమార్‌ కూడా కీలక సమాచారం చెప్పినట్లు సమాచారం. కేటీఆర్ ఆదేశాలు ఇవ్వడంతోనే నగదు రిలీజ్ చేశామని అరవింద్ కుమార్ స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేబినెట్ అప్రూవల్ లేకుండా నిధులు రిలీజ్ చేయవద్దని మీకు తెలియదా ? అని అరవింద్ ను అడిగారు.

మంత్రిగా కేటీఆర్ ఆదేశాలు ఇచ్చినా .. ఆ రూల్స్‌ను ప్రజాప్రతినిధులకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా ? అని ఏసీబీ అధికారులు నిలదీశారని సమాచారం.హెచ్‌ఎండీఏ తన పరిధిని మించి నగదు నుఎలా బదిలీ చేసింది? మౌఖిక ఆదేశాలు కేవలం కేటీఆర్ మాత్రమే ఇచ్చారా? లేక ఇంకా ఎవరైనా ఉన్నారా ?ఎఫ్‌ఈవోతో చేసుకున్న అగ్రిమెంట్ ఏంటి? అగ్రిమెంట్‌లోరాసుకున్న నిబంధనలు ఏంటి?గ్రీన్ కో స్పాన్సర్ షిప్ నుంచి వైదొలగడానికి కారణం ఏంటి ? ఒప్పందం ప్రకారం 2024 లో నిర్వహించాల్సిన రేస్ ఎందుకు నిర్వహించలేక పోయారు…? హెచ్‌ఎండీఏ కార్ రేసింగ్ కోసం కాకుండా .. ఇంకా వేటికైనా నిధులు రిలీజ్ చేశారా ? హెచ్‌ఎండీఏ నిర్ణయాల్లో చైర్మన్ పాత్ర ఏమైనా ఉంటుందా ? అంటూ ఇలా వరుసగా ప్రశ్నలను ఏసీబీ సంధించిందని సమాచారం. వీటిపై అరవింద్ కుమార్ చెప్పిన ప్రతి స్టేట్‌మెంట్‌ను ఏసీబీ రికార్డు చేసింది. ఈ ఇద్దరు అధికారులు ఇచ్చిన స్టేట్ మెంట్ తో ఈ కేసు మరింత కీలక మలుపు తిరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నిబంధనలు ఉల్లంఘన?

ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌తో ఏకీభవించిన కాంపిటెంట్ అథారిటీ ఆమోదం పొందకుండానే మొత్తం రూ. 54 కోట్లకు పైగా నగదును ఎఫ్‌ఈవో చెల్లింపు ద్వారా ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఫార్ములా ఈ రేసు కేసులో జరిగిన ఒప్పందంలో హెచ్‌ఎండీ భాగస్వామి కానప్పటికీ చెల్లింపులు చేసింది. పార్టీల మధ్య అక్టోబర్ 30, 2023 నాటి ఒప్పందంపై సంతకం చేయడానికి ముందే చెల్లింపులు జరిగాయి. ఈసీఐ నుంచి ఎటువంటి ఆమోదం తీసుకోకుండా ఎంసీసీ అమలులో ఉన్నప్పుడు కొంత భాగం చెల్లింపు జరిగింది. విదేశీ మారకపు చెల్లింపులకు సంబంధించి ఇప్పటికే ఉన్న నియమాలు, నిబంధనలను ఉల్లంఘిస్తూ విదేశీ కరెన్సీలో చెల్లింపులు జరిపారు.

Leave A Reply

Your email address will not be published.