- క్షత్రియ సమాజ్ సంఘ అభివృద్ధికి కృషి – ధోండి నందలాల్ సంఘ అధ్యక్షులు.
కోరుట్ల, ముద్ర విలేకరి: పట్టణంలోని సోమవంశ సహసర్జన క్షత్రియ సమాజ్ ( పట్కారి ) సంఘ కార్యాల యంలో నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణం స్వీకారం ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడిగా ధోండి నందలాల్, ప్రధాన కార్యదర్శి గా శికారి గోపికృష్ణ, కోశాధికారిగా జమన్ జ్యోతి రాజేంద్రప్రసాద్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సంద ర్భంగా ఎన్నికైన వారిని సంఘ సభ్యులు శాలువతో అభినందనలు తెలిపి, శాలువాతో సన్మానించారు. అనంతరం అధ్యక్షులు మాట్లాడుతూ సభ్యులందరి సహాయ సహకారాలతో నిరంతరం సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు శికారి విశ్వనాథం, శికారి విజయ్, గంటెడి శ్రీనివాస్, జమన్ జ్యోతి శ్రీనివాస్, బచ్చావల సంజీవ్, బదాం పురుషోత్తం, చావ్ల లక్ష్మీనారా యణ,బచ్చవాల కిషన్, గంగా మోహన్, బచ్చవాల శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు.