ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
బిజెపి జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో శనివారం స్థానిక వినాయక చౌరస్తా వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఇండియా కూటమి పార్టీలపై నల్ల బ్యాడ్జిలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాధురి చంద్ర మాట్లాడుతూ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే నారీశక్తి వందన్ అధినియం మహిళల సాధికారతకు ఎంతో కీలకమని తెలిపారు. దేశవ్యాప్తంగా మహిళలకు రాజకీయంగా సమాన అవకాశాలు కల్పించడానికి ఈ చట్టం ఒక చారిత్రాత్మక అడుగని పేర్కొన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఇండియా కూటమి పార్టీలు మహిళల అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని తీవ్రంగా విమర్శించారు. మహిళల హక్కులను నిర్లక్ష్యం చేసే పార్టీలకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు రాజకీయంలో రాణించాలంటే అది కేవలం ఇందిరా గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ లకు మాత్రమే పరిమితమా దేశవ్యాప్తంగా రాజకీయంలో ఉన్నటువంటి మహిళలకు సముచిత స్థానం అవసరం లేదా అని ప్రశ్నించారు. 2008వ సంవత్సరంలో ఇదే మహిళా బిల్లుపై రాజ్యసభలో బిల్లు పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మరి లోక్ సభలో ఎందుకు ఆ బిల్లును ప్రవేశ పెట్టలేదు అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాలయాపన చేస్తూ మహిళా ఓట్లను ఆర్జిస్తూ గద్దెనెక్కాలని చూస్తే సహించబోమని తేల్చి చెప్పారు
ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ వంగేటి సుచరిత రెడ్డి, బండారు స్వర్ణలత, తుమ్మల యాస్మిన్, మహిళా మోర్చా నాయకులు బూరుగు రాణి,లక్కాకుల మాధవి, గుంటిపల్లి మహేశ్వరి,చామకూరి చిత్రలేఖ, ఎంజాల మల్లికా, కిసాన్ మోర్చా నాయకులు పడమటి జగన్ మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా, జిల్లా కార్యదర్శి మేడి కోటేష్, తడిసిన మల్లారెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబెర్ కోళ్ల బిక్షపతి, సుర్వి శ్రీను, జిల్లా కార్యాలయ కార్యదర్శి మంగు నర్సింహారావు,ఎండీ.మహ్మమోద్,పట్టణ ప్రధాన కార్యదర్శి ఉడుత భాస్కర్, పట్టణ ఉపాధ్యక్షులు కొల్లూజు శ్రవణ్, కనుకుంట్ల రమేష్,కొలిచేలిమి మల్లికార్జున్,ఉష కిరణ్,సత్యం, రాజు, తుమ్మల నగేష్, ఎరపుల శివ పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.