మోత్కూరు ముద్ర న్యూస్ :
మండలంలోని పాలడుగు గ్రామంలో ఇటీవల భూతగాధాలో కక్షా పెంచుకొని తన వ్యవసాయ బావి దగ్గర దారి కాచి వదిన బొంత లక్ష్మి అలియాస్ వెంకటమ్మ ను గొంతు కోసిన ఆమె మరిది బొంత అశోక్ ,అతనికి సహకరించిన తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన సూర నరేష్ అడ్డగూడూరు మండలం చిన్న పరిసర గ్రామానికి చెందిన ఓర్సు నరసింహ ఓర్సు కృష్ణ లను అరెస్ట్ చేసి రామన్నపేట కోర్టు కు రిమాండ్ తరలించినట్లు మోత్కూరు సి.ఐ. సి వెంకటేశ్వర్లు తెలిపారు. సి.ఐ. వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీని హత్య చేయడానికి ప్రయత్నించి హత్యాయత్నం చేసి తప్పించుకొని కారులో తిరుగుతున్న కారు టి.ఎస్. 11ఈ.జడ్ 3123 లో నిందితులైన ఎ 1 బొంత అశోక్, ఎ 2 సూర నరేష్, ఎ 3 ఓర్సు నర్సింహ్మ, ఎ 4 ఓర్సు కృష్ణ దగ్గర నుంచి కత్తి టీ.ఎస్. 30 కే 0612 కారు , కత్తిని,నలుగురు దగ్గర ఉన్న సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు సి.ఐ. చెప్పారు. ఈ కేసును జిల్లా ఎస్పీ ఆదేశాలను అనుసరించి డి.ఎస్.పి సి.ఐ. ఆధ్వర్యంలో రెండు రోజుల్లో నిందితులను పట్టుకున్నట్లు సి.ఐ తెలిపారు. .