Take a fresh look at your lifestyle.

బంజారాల ఆధ్యాత్మిక గురువు సేవాలాల్ మహరాజ్ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

 
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సేవలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే సున్నిత లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. దేశ ప్రజలకు సేవాలాల్ మహారాజ్ ఆదర్శప్రాయుడన్నారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలను కాపాడి వారి ఔన్నత్యానికి పునాదులు వేశారని సేవాలాల్ మహారాజులు కొనియాడారు.
శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ ని,,ఆయన చూపించిన ఆధ్యాత్మిక మార్గంలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.