Take a fresh look at your lifestyle.

ది ఫర్టిలైజర్స్ ,పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవం

  • అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శిగా గౌరిశెట్టి నాగరాజు, కోశాధికారిగా నరసింహారెడ్డి

హనుమకొండ,ముద్ర: వరంగల్ శివనగర్ లోని ది ఫర్టిలైజర్స్,పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం కావడం తో శుక్రవారం అసోసియేషన్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు.ఎన్నికల అథారిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, సభ్యులు సదానందం,వెంకట్రావు లు అధ్యక్షులుగా నాగుర్ల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా గౌరిశెట్టి నాగరాజు,కోశాధికారిగా బొద్దిరెడ్డి నరసింహారెడ్డిని ప్రమాణం స్వీకారం చేయించారు.అనంతరం కార్యవర్గాన్ని గజమాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టి వాటిని ఏకగ్రీవంగా ఆమోదించారు .ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డీలర్స్ మరియు కార్యవర్గం సహాయ సహకారాలతోనే అన్ని పనులను పూర్తి చేశామని మునుముందు మీ యొక్క సహాయ సహకారాలు ఇలానే ఉండాలని అన్నారు.డీలర్స్ శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు.ప్రధాన కార్యదర్శి గౌరీశెట్టి నాగరాజు అసోసియేషన్ ఆర్థిక లావాదేవిలను వివరించారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల నుండి సుమారు 500 మంది అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.