కోరుట్ల/కథలాపూర్, ముద్ర విలేకరి: శుక్రవారం రోజు ప్రకటించిన ఐఐఐటి ఫలితాలలో జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల్ తకల్లపల్లి గ్రామానికి చెందిన దమ్మ సింధు సీటు సాధించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదివి, అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ప్రతిష్టాత్మక ఐఐఐటి సీటు సాధించిన సింధును పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోటూరి రవీందర్, అధ్యాపకులు రాజశేఖర్, గంగాధర్, శ్రీహరి, హరినాథ్, మరియు బృందం, ఏఏపిసి ఛైర్మెన్, గ్రామస్తులు అభినందించారు.