కుషాయిగూడ (నాగారం) , ముద్ర విలేఖరి: నాగారంలోని ఎస్ క్యూర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈస్ట్ గాంధీనగర్ ఫేస్-2 లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆదివారం కాలనీ సంక్షేమ సంఘం భవనంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరాన్ని మాజీ కౌన్సిలర్ మాదిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీ ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బిపి, షుగర్, కంటి, దంత, తదితర రక్త పరీక్షలను నిర్వహించి వైద్య సలహాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వప్న, డాక్టర్ శ్వేత, రామారావు, మాజీ కోఆప్షన్ సభ్యుడు షఫీ, కాలనీ కమిటీ సభ్యులు కే రామచంద్రారెడ్డి, సాయి యాదవ్, ఆనంద శర్మ, లక్ష్మీనారాయణ, రమేష్ బాబు, జే బాలు, పిచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.