Take a fresh look at your lifestyle.

పాత పనులనే కొత్తగా చూపిస్తున్నారు

  • బీఆర్ఎస్ నాయకులు.

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులతో చేపట్టిన పాత పనులను కాంగ్రెస్ లీడర్లు కొత్తగా చూపిస్తూ శంకుస్థాపనలు చేస్తున్నారని బీఆర్ఎస్ 14 వ వార్డు మాజీ కౌన్సిలర్ భర్త గడ్డం రాజు ఆరోపించారు. గురువారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చెన్నూరు ఎమ్మెల్యే,కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి 14 వ వార్డులో బుధవారం శంకుస్థాపన చేసిన పనులను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. వార్డు కౌన్సిలర్గా చేసిన అభివృద్ధి పనులపై పూర్తి స్థాయిలో అవగాహన ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంత అభివృద్ధికి కొత్తగా నిధులు తెచ్చిన దాఖలాలు లేవన్నారు. ఇప్పటికైనా నిధులు తెచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి పునాదులు వెయ్యాలని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్,పట్టణ అధ్యక్షుడు కంభగోని సుదర్శన్ గౌడ్,సీనియర్ నాయకులు రామిడి కుమార్, బడికల సంపత్,పోగుల మల్లయ్య, జిలకర మహేష్,అలుగల సత్తయ్య, ఎల్లబెల్లి మూర్తి, కొండ కుమార్, యువ నాయకులు లక్ష్మీకాంత్, చంద్రకిరణ్, శ్రీనివాస్, సదానందం, ఓదెలు, శివ, మణి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.