- రూ.92వేలు స్వాధీనం.
బాన్సువాడ, ముద్ర: తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతమైన జుక్కల్ల్ నియోజకవర్గంలోని మద్నూర్ శివారులో 161 జాతీయ రహదారిపై ఉన్న రవాణా శాఖ చెక్ పోస్ట్ లో ఏసీబీ డిఎస్పి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం సోదాలు నిర్వహించారు. ఎసిబి డిఎస్పి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సలబత్పూర్ రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. లారీల వద్ద నుంచి అక్రమంగా 92,000/- వసూలు చేసినట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. దీంట్లో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్ రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయంలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ డిఎస్పి రాజశేఖర్ గౌడ్ చెక్ పోస్ట్ పై ఆకస్మిక మెరుపు దాడి నిర్వహించారు. రవాణా శాఖకు సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు.ఆ ఇద్దరు వ్యక్తుల చేత వాహనాలలో డబ్బులు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారుల విచారణలో వెల్లడైంది. ఇంకా రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇద్దరు అధికారులు ఉండి కూడా వారు కాసులకు కక్కుర్తి పడి, అక్రమ వసూళ్లు చేస్తున్నారు. ఇద్దరి అధికారులపై కూడా వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రవాణా శాఖ కార్యాలయం పై నిఘా పెట్టారు. గురువారం తెల్లవారుజామున పక్క సమాచారం మేరకు ఏసిబి అధికారులు రవాణా శాఖ కార్యాలయం పై మెరుపు దాడులు చేశారు. పూర్తి సమాచారం త్వరలో వెల్లడిస్తామని ఎసిబి డిఎస్పి శేఖర్ గౌడ్ వెల్లడించారు.