Take a fresh look at your lifestyle.

హోంగార్డ్  విధులు నిర్వహిస్తున్న  సింహాచలం  మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ

మదాపూర్, ముద్ర: మియపూర్ మెట్రో స్టేషన్ 600 పిల్లర్ వద్ద ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ముగ్గురు పోలీసులపై కూకట్పల్లి నుండి మియపూర్ వైపు వేగంగా దూసుకువచ్చిన లారీ వలన అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ సింహాచలం మృతి చెందడం చాలా బాధకరమైన విషయం అని పీయేసీ చైర్మన్ అరికపూడి గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాము అని, వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, ప్రభుత్వం తరపున సహాయం అందేలా తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలో ఉంటాయి అని, వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని PAC చైర్మన్ గాంధీ గభరోసా ఇచ్చారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ వికేండేర్, రాజవర్ధన్ త్వరగా కోలుకోవాలని చైర్మన్ గాంధీ ప్రార్ధించారు.

Leave A Reply

Your email address will not be published.