ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని బిజేపీ నియోజకవర్గం కార్యాలయం కమల నిలయంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.బోగ శ్రావణి పార్టీ జెండా ఆవిష్కరించారు. అలాగే జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో అన్ని వార్డుల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ అధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, సిరికొండ రాజన్న, బిజెపి జిల్లా కార్యాలయ కార్యదర్శి జుంబర్తి దివాకర్, నాయకులు , బద్దెల గంగరాజం, దురిశెట్టి మమత, మ్యాకల లక్ష్మి, పవన్ సింగ్, అబ్బడి సోమేశ్వర్, కశేటి తిరుపతి, మహేష్,బాపురపు శేఖర్, మల్లారెడ్డి,సింగం పద్మ, పిండేరు భాను ప్రియ, గడ్డల లక్ష్మి, సోమ లక్ష్మి, కడార్ల లావణ్య, మామిడాల కవిత, ఇట్యాల రాము, ముద్దం రాము, వోడ్నాల మహేష్, వోడ్నాల రమేష్, నాగభూషణం, రాగిళ్ల నారాయణ, కొక్కు రాములు, మామిడి సతీష్, బండారి మల్లేశం, జంగిలి మహేష్, సిరిపురం బాలాజీ, జంగిలి రమేష్, తుమ్మనపల్లి రాజశేఖర్, గంగాం సుభాష్, తదితరులు పాల్గొన్నారు.
