Take a fresh look at your lifestyle.

మార్చి 31లోపు క్రమబద్ధీకరణ ఫీజు చెల్లిస్తే 25 శాతం రాయితీ

  • ఎల్ ఆర్ ఎస్ స్కీమ్ సద్వినియోగం పై దరఖాస్తుదారులకు అవగాహన కల్పించాలి.
  • మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడివోలు లేఅవుట్ యజమానులతో సమావేశాలు ఏర్పాటు చేసి లక్ష్యాలను పూర్తిచేయాలి.
  • రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముద్ర ప్రతినిధి: ఎల్.అర్.ఎస్.కు దరఖాస్తు చేసుకున్న వారు మార్చి 31లోగా క్రమబద్దీకరణ రుసుం చెల్లించి క్రమబద్దీకరణ చేసుకుంటే 25 శాతం రాయితీ వర్తిస్తుందని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఎల్.అర్.ఎస్ పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అక్రమ లేఔట్ లోని ఫ్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులేషన్ స్కీమ్)ను సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.మండల స్థాయి మున్సిపాలిటీ స్థాయిలలో ఎంపిడిఓలు,మున్సిపల్ కమిషనర్ లు అక్రమ లేఅవుట్లుచేసిన లేఅవుట్ యజమానులతో సమావేశం నిర్వహించి ప్రతి ఫ్లాట్ దారున్ని ఎల్ ఆర్ ఎస్ సద్వినియోగం చేసుకునేలా చేయాలని అన్నారు.ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయుట ఆడియో రికార్డింగ్ చేసే స్వచ్ఛ ఆటోల ద్వారా ప్రచారం కల్పించాలని సూచించారు.ఎల్ఆర్ఎస్ అప్లై చేసిన లబ్ధిదారులకు ఎల్ఆర్ఎస్ రుసుము మార్చి 31,2025 సంవత్సరం లోపు రుసుం చెల్లించినట్లయితే 25% తగ్గింపు ఉంటుందని లబ్ధిదారులకు అవగాహన కల్పించి పెద్ద ఎత్తున చదివి వినియోగం చేసుకునేలా చేయాలన్నారు.ఎల్ఆర్ఎస్ లో వచ్చిన దరఖాస్తులు లే అవుట్లకు సంబంధించి మండల స్థాయిలో రెవెన్యూ మరియు ఇరిగేషన్ శాఖ వారు ఎప్పటికప్పుడు పరిశీలించి దరఖాస్తులను డిస్పోస్ చేయాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.