Take a fresh look at your lifestyle.

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు HRA 24 శాతం హెచ్ ఆర్ ఏ ఇవ్వాలి

  • తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రంగారెడ్డి జిల్లా ప్రతినిధుల డిమాండ్
  • జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబుకు వినతిపత్రం అందజేత

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముద్ర ప్రతినిధి : కొంగరకలాన్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లిస్తున్న హెచ్ ఆర్ ఏను 24 శాతానికి పెంచాలని జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు.ఈ మేరకు సోమవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె. రామారావు, కార్యదర్శి శ్రీనేష్ కుమార్ నోరి రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబును ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కొంగర కలాన్ వద్ద గల రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ లో వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ముఖ్యంగా కలెక్టరేట్ ఉద్యోగులకు తగ్గించిన ఇంటి అద్దె బత్యాన్ని 24 శాతంకు కు పెంచాలని ఆయన్ని కోరారు.హెచ్ ఆర్ ఏ తగ్గింపుతో గత రెండు సంవత్సరాలనుండి కొంగరకాలన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆర్ధికంగా చాలా నష్టం జరిగిందని పేర్కొన్నారు.గత ప్రభుత్వం తమ ప్రమేయం లేకుండానే నగరం నడిబొడ్డున లకడికాపూల్ లో ఉన్న కలెక్టరు ఆఫీసును మరియు ఇతర జిల్లా కార్యాలయాలను కొంగరుకలాన్ కు మార్చిందని మంత్రికి చెప్పారు.దీంతో సుమారుగా 600 మంది ఉద్యోగులు అనేక వ్యయ ప్రయాశాలకు ఓర్చి నగరం నుండి కొంగర కలా న్ కలెక్టరేట్ కు వస్తున్నారని పేర్కొన్నారు.కొంగరకలాన్ కలెక్టరేట్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు గత ప్రభుత్వం ఇంటి అద్దె బత్యాన్ని 24 శాతం నుండి 11 శాతానికి తగ్గించ్చిందని,కావున కొంగర కాలాన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారికి వచ్ఛే ఇంటి అద్దె బత్యాన్ని 24% శాతానికి పెంచాలని మంత్రి శ్రీధర్ బాబు కు టిజివో జిల్లా ప్రతినిధులు వివరించారు.దీనిపై జిల్లా ఇంచార్జ్ మంత్రి సానుకూలంగా స్పందించి,పరిశీలించి ఉద్యోగుల కు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని టిజివో నాయకులు రామా రావు, శ్రీనిష్ కుమార్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.