Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ గురుకులాలు, హాస్టళ్లలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు

  • పిల్లలకు నాణ్యమైన ఆహారం, కామన్ మెనూ డైట్ అందేలా చర్యలు
  • ప్రత్యేక అధికారులకు, సంక్షేమ శాఖల జిల్లా అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముద్ర ప్రతినిధి: గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలను రెగ్యులర్ గా చెక్ చేయాలని ప్రత్యేక అధికారులను, సంబంధిత అధికారులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు.సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్రంలో ఉన్న గురుకులాలు,రెసిడెన్షియల్ పాఠశాలల్లో కలెక్టర్, అదనపు కలెక్టర్ ల తనిఖీ తర్వాత పరిస్థితులలో మార్పులు వచ్చాయని..తనిఖీలు కొనసాగించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.దీంతో కలెక్టర్ నారాయణరెడ్డి వెంటనే జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.ప్రతి మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు,సంక్షేమ హాస్టల్స్ పనితీరును తెలుసుకునేందుకు టాస్క్ ఫోర్స్ తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.పిల్లలకు అందించే ఆహార నాణ్యత పెరిగేలా,కామన్ మెను డైట్ పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

  • పంటలు ఎండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

యాసంగి పంట సంరక్షణకు రాబోయే పది రోజులు చాలా కీలకమని కలెక్టర్ స్పష్టం చేశారు.విద్యుత్, ఇరిగేషన్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ సాగు నీరు,విద్యుత్తు సరఫరా అవసరమైన మేర పంట పొలాలకు చేరేలా చూడాలని, ఆదేశించారు.వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండాలన్న సిఎస్ ఆదేశాలను విద్యుత్ అధికారులను పక్కాగా అమలుచేయాలని కలెక్టర్ సూచించారు.రాబోయే 10 రోజులపాటు వ్యవసాయ శాఖ అధికారులు ఫీల్డ్ లెవెల్ లో రైతులతో సంప్రదింపులు జరుపుతూ విద్యుత్,సాగు నీరు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పడే మండలాల వారీగా తహసిల్దార్,విద్యుత్ ఏ ఈ,నీటిపారుదల శాఖ ఇంజనీర్,వ్యవసాయ అధికారితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా పర్యటించాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు.ఈ సమావేశంలో ఎలక్ట్రిసిటీ, వ్యవసాయ,ఇరిగేషన్,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.