Take a fresh look at your lifestyle.

రుక్సానాకు ఐ ఈ ఈ ఈ సీనియర్ సభ్యురాలుగా గుర్తింపు

 

రాజేంద్రనగర్, ముద్ర ప్రతినిధి:

వాసవి ఇంజినీరింగ్ కాలేజ్, హైదరాబాద్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కుమారి షేక్ రుక్సానాకు ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక సంస్థ అయిన ఐ ఈ ఈ ఈ ద్వారా సీనియర్ సభ్యురాలుగా గుర్తింపు పొందారు. ఈ గౌరవం సాధారణంగా ఇంజినీరింగ్ రంగంలో టాప్ 10% ప్రొఫెషనల్స్‌కే లభించగా, కనీసం 10 సంవత్సరాల అకాడెమిక్ మరియు ప్రొఫెషనల్ అనుభవం ఉన్నవారికి మాత్రమే ప్రదానం చేయబడుతుంది. గ్రాఫ్ న్యూరల్ నెట్‌వర్క్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, స్మార్ట్ గ్రిడ్స్ వంటి ఆధునిక రంగాల్లో ఆమె పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ లైఫ్ అంచనా కోసం ఆమెన్ నూతన ప్రతిపాదనలు ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించారు. అంతేకాకుండా ఆమె తన పరిశోధనను ఇటీవల అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో జరిగిన ఎస్ ఎ ఈ డబ్ల్యూ సి ఎక్స్ ప్రపంచ కాంగ్రెస్ అనుభవ అంతర్జాతీయ సదస్సులో ప్రదర్శించారు. భారతదేశం తరఫున మొబిలిటీ, సస్టైనబిలిటీ మరియు స్మార్ట్ సిస్టమ్స్ రంగాల్లో ఉన్న సవాళ్లకు పరిష్కారాలను అందించే దిశగా తన కృషిని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించారు. దీంతో ఐ ఈ ఈ ఈ సంస్థ ఆమె ప్రతిభను గుర్తించి సీనియర్ సభ్యురాలుగా న్యూయార్క్ వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా వాసవి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపల్ రమణ, ప్రొఫెసర్లు, కళాశాల సిబ్బంది ఆమెను అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.