Take a fresh look at your lifestyle.

కార్మికుల సార్వత్రిక సమ్మెకు పౌర హక్కుల సంఘం మద్దతు.

ముద్ర: కాప్రా

ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 12న జరిగే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్. అసంఘటిత కార్మిక సంఘ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదగాని కుమార్. ప్రజా దేశభక్త ఉద్యమం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి చంద్రమౌళి. సంఘీభావని ప్రకటించారు మంగళవారం కాప్రా తాసిల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం తమ హక్కులను సాధించుకోవాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు.బ్రిటిష్ పాలన నుండి దేశంలోని కార్మికులు అనేక ఉద్యమాలు ద్వారా సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాయడమేనని 29 కార్మిక చట్టాలను రక్షించుకోవాలని వెల్ఫేర్ బోర్డు పరిధిలోని పథకాలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు నేచురల్ డెత్ పథకాలను ప్రైవేటు భీమా ఫ్యాక్టరీలకు అప్పగిస్తూ జారీచేసిన జీవో నెంబర్ 12 లో వెంటనే రద్దు చేయాలని పాత విధానంలోనే ప్రభుత్వమే అమలు చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు విద్యుత్ సవరణ బిల్లు 2025 వ్యవసాయ రంగానికి సంబంధించిన చట్టాలను రైతులు కార్మికులు మధ్యతరగతి సామాన్య ప్రజలపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు

Leave A Reply

Your email address will not be published.