Take a fresh look at your lifestyle.

ఐక్య పోరాటాలతోనే కార్మికుల హక్కుల సాధన

  • మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గుర్నాథ్ రెడ్డి.
  • పట్నంలో ఘనంగా మే డే కార్మిక దినోత్సవ వేడుకాలు.

ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: కార్మికుల హక్కుల సాధనకు ఐక్య పోరాటాలు చేయాలని ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గుర్నాథ్ రెడ్డి అన్నారు.మే డే కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐఎన్టియుసి నియోజకవర్గ అధ్యక్షులు పాలకుర్ల ఐలేష్ గౌడ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలో గురువారం కార్మిక జెండాను ఎగుర వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవాలంటే కార్మికులంతా ఐకమత్యంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పారు.కార్మిక చట్టాలని కలుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కార్మిక లోకం తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈసీ శేఖర్ గౌడ్, నాయకులు రాజు, పల్లటి భాస్కర్, ప్రేమ్ కుమార్, జహంగీర్, నగేష్, రవికుమార్, సంతోష్, కర్ణాకర్ రెడ్డి, కృష్ణ, జంగయ్య, వెంకటేష్, భరత్ రెడ్డి, శ్యామ్ లాల్, ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు జియావుద్దీన్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.