రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన అరికపురం రాజేశ్వరి కుటుంబానికి గురువారం ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూతనందించారు.నిరుపేద కుటుంబం కావడంతో మృతురాలి దశదినకర్మకు ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలను కుటుంబ సభ్యులకు అందించారు.ఇంకా ఎవరైనా మానవతవాదులు,స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ముందుకు వచ్చి పేద కుటుంబానికి సహాయాన్ని అందించాలని ట్రస్ట్ సభ్యులు కోరారు.