Take a fresh look at your lifestyle.

విద్యార్థినిని చికిత్సకు పంపి పరామర్శించిన కలెక్టర్

 

మహాదేవపూర్, ముద్ర:

భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం గాంధీనగర్ లోని మహాత్మాజ్యోతిభా ఫూలే గురుకుల పాఠశాలకు చెందిన కీర్తన అనే విద్యార్థిని ఉదయం 10 వ తరగతి పరీక్షా కేంద్రానికి వచ్చినప్పటి నుండి అలసటగా ఉందని శ్వాస ఆడడం లేదని ఇబ్బందులు పడుతున్నది. గణపురం జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పరీక్షా కేంద్రం పరిశీలనకు వెళ్లిన జిల్లా కలెక్టర్ విషయం తెలుసుకొని వెంటనే ప్రభుత్వ వాహనంలో తన వ్యక్తిగత సిబ్బందిని వెంట పంపి స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి తిరిగి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అస్వస్థతకు గురైన విద్యార్థినితో మాట్లాడి ధైర్యం చెప్పి తిరిగి పరీక్షా కేంద్రానికి తన వాహనంలోనే తరలించారు. స్పందించిన విధానం పట్ల పలువురు జిల్లా కలెక్టర్ ను అభిందిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.