Take a fresh look at your lifestyle.

చిన్న కాపర్తి లో రైతు సంఘం ఆవిర్భావ వార్షికోత్సవాలు

ముద్ర, చిట్యాల :

అఖిల భారత కిసాన్ సభ( అఖిల భారత రైతు సంఘం)(AIKS) 90వ వార్షికోత్సవాల సందర్భంగా చిట్యాల మండలం చిన్నకాపర్తి, ఉరుమడ్ల, వెలిమినేడు గ్రామాలలో ఆదివారం ఘనంగా జెండా ఆవిష్కరణ లు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఐతరాజు నర్సింహా, జిల్లా కమిటీ సభ్యులు అరూరి శ్రీను లు ముఖ్య అతిధులుగా హాజరై మాట్లాడుతూ దేశంలో తొంబై సంవత్సరాల నుండి రైతు, కూలీల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే సంఘం అఖిల భారత కిసాన్ సభ అని అన్నారు. ఈ నెల 14న నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఏచూరి గార్డెన్ లో రైతు సంఘం జిల్లా మహాసభలు, ఈ నెల 23,24,25 వ తేదీ లలో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంఘం జెండాలను వెలిమినేడు లో అరూరి శ్రీను, ఉరుమడ్ల లో ఐతరాజు నర్సింహా, చిన్న కాపర్తిలో రూపని ఇద్దయ్య లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు బొబ్బిలి సుధాకర్ రెడ్డి,అవిశెట్టి శంకరయ్య, కోనేటి రాములు,బెలిజ మల్లయ్య ,శిరసు హన్మయ్య,వీరమళ్ళ వెంకన్న,వీరమళ్ళ శంకర్, మామిడి గణేష్, మెట్టు చిన్న అంజయ్య, బుచ్చి రెడ్డి, సత్తయ్య, ముత్తయ్య పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.