Take a fresh look at your lifestyle.

శ్రావణ మాసం పురసరించుకొని వైభవంగా రుద్రాభిషేకం

కోరుట్ల, ముద్ర విలేకరి: కోరుట్ల పట్టణంలోని జవహర్ రోడ్ లో గల ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రావణ మాసం పురస్కరించుకొని పట్టణ పురోహితులు పాలెపు రాము శర్మ వైదిక నిర్వహణలో శివునికి రుద్రాభిషేకం, అన్నపూజ కార్యక్రమంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ పుణ్యావాచనం అనంతరం ప్రధాన కలశ స్థాపన చేశారు. ఈ సందర్భంగా రాము శర్మ మాట్లాడుతూ శ్రావణ మాసం సందర్భంగా శివునికి అభిషేకం, అన్నపూజ నెల రోజుల పాటు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అల్లాడి ప్రవీణ్, తాటికొండ ఆంజనేయులు, చిద్రాల వినోద్ భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.