Take a fresh look at your lifestyle.

కస్తూరిబా గాంధీ విద్యాలయంలో “షీ” టీమ్ అవగాహన కార్యక్రమం

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :

జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, అడిషనల్ ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు కోడేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో “షీ” టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో “షీ” టీమ్ ఏఎస్ఐ విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న నేరాలు మరియు వాటి నివారణపై విద్యార్థినీ, విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు. డయల్ 100, “షీ” టీమ్ హెల్ప్‌లైన్ 181, సైబర్ క్రైమ్ నెంబర్ 1930 వంటి అత్యవసర సేవల గురించి వివరించారు.

అదేవిధంగా సీసీ కెమెరాల ప్రాముఖ్యత, బాల్యవివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, కమ్యూనిటీ పోలీసింగ్, మానవ అక్రమ రవాణా, మద్యపాన నిషేధం, ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాల నివారణ, గంజాయి మరియు డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించారు. అలాగే ఫోక్సో, నిర్భయ చట్టాల గురించి కూడా వివరించారు.

ఈ కార్యక్రమంలో భరోసా సభ్యులు గాయత్రి, KGBV స్కూల్ స్పెషల్ ఆఫీసర్ వరలక్ష్మి, అధ్యాపక బృందం, “షీ” టీమ్ సభ్యులు వెంకట్రాములు, వెంకట్ నాయక్ పాల్గొన్నారు. విద్యార్థులు చురుకుగా పాల్గొని పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.