ముద్ర, భువనగిరి జిల్లా ప్రతినిధి :
జిల్లా కేంద్రంలోని పోచంపల్లి మండలం జలాల్ పుర్ లో గల కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శనివారం సందర్శించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కళాశాలలో డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని బాలికలను అడిగి తెలుసుకున్నారు. వంటకు అవసరమైన సరుకులు, సామాగ్రిని పరిశీలించారు. 9వతరగతి మరియు 11వ తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు.బాలికలను ఆప్యాయంగా పలకరిస్తూ, ఇష్టపడి చదువుకోవాలని, విద్యార్థుల యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలని వారిలో స్పూర్తిని పెంపొందింపజేశారు. కళాశాల పరిసరాలను పరిశీలించి అట్టి స్థలాని శుభ్రపరచి విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఇందిరా, పోచంపల్లి ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు ఉన్నారు.