ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: గురుపౌర్ణమి సందర్భంగా,అలాగే తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ గా జనక్ ప్రసాద్ పదవిలో ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం గోదావరిఖనిలోని జనక్ భవన్ లో జనక్ ప్రసాదను ఐ ఎన్ టి యు సి శ్రేణులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారి సేవలను పలువురు నేతలు ప్రశంసించారు. గత 13 సంవత్సరాలుగా అలుపెరుగని నాయకుడిగా కనీస వేతనాలపై చర్చను ప్రారంభించి, రాష్ట్రంలో సుమారు 1.3 కోట్ల అసంఘటిత కార్మికుల కోసం సంకల్పంతో ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు.కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జనక్ ప్రసాద్ చేపట్టిన కార్యక్రమాలు ప్రశంస నీయమని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి,వైస్ ప్రెసిడెంట్ సదానందం, వికాస్ కుమార్ యాదవ్, ఏనుగు రవీందర్ రెడ్డి, దాస్, ఆరేపల్లి శ్రీను, రాజయ్య తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.