వానాకాలం సవాళ్లను అవకాశాలుగా మార్చి, రికార్డు స్థాయిలో అధిక దిగుబడులతో రాష్ట్రానికి అన్నం పెట్టిన అన్నదాతలు
ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ రైతులు సాధించిన వరి పంట విజయం ఒక సాధారణ గణాంకం కాదు.అది రైతు ధైర్యానికి, శ్రమకు, విజ్ఞానానికి నిలువెత్తు సాక్ష్యం.
అకాల వర్షాలు, విత్తనాల ధరలు, ఫర్టిలైజర్ అధిక ధరలు, ఇవన్నీ ఉన్నప్పటికీ రైతు వెనక్కి తగ్గలేదు. భూమిని నమ్మాడు భవిష్యత్తుకు మార్గదర్శి అయ్యాడు, 2025-26 సంవత్సర ఖరీఫ్ సీజన్‌లో
మెరుగైన విత్తనాల ఎంపిక,
శాస్త్రీయ సాగు పద్ధతులు,
కాలువలు,చెరువుల, ద్వారా సమృద్ధిగా నీరు, రైతు అనుభవం కొత్త సాంకేతికతో కలిసి
వరిపంట పొలాలను బంగారు రంగులోకి మార్చారు..
ఎక్కడ చూసినా గింజలతో వంగిన వరికట్టలు, కోత యంత్రాలతో హుషారుగా పని చేస్తున్న పొలాలు కనిపించాయి. గతంతో పోలిస్తే ఎకరాకు దిగుబడి పెరగడం రైతుల ముఖాల్లో సంతృప్తిని నింపింది.
“ఈసారి వరి పంట మనల్ని మోసం చేయలేదు” అన్న మాటలు చాలా గ్రామాల్లో వినిపించాయి.
ఈ విజయం ఒక్క రైతుదే కాదు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిచ్చింది. అలాగే రాష్ట్రానికి ఆహార భద్రతను కూడా పెంచింది
భవిష్యత్తులో యువతకు ‘వ్యవసాయం లాభసాటి’ అన్న నమ్మకాన్ని కలిగించింది.
వానాకాలం వరమైంది,ఖరీఫ్ వరి పంటతో తెలంగాణ రాష్ట్ర రైతులు మరోసారి విజయగాథ రాశారు.
వరిలో ఘన విజయం.
ఖరీఫ్ లో 8300 వరి కొనుగోలు కేంద్రాలను రాష్ట్రంలో ఏర్పాటు చేశారు.అక్టోబర్ నెలలో ధాన్యం సేకరణ ప్రారంభించారు. ఇప్పటివరకు 70.82 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని సేకరించారు,. దీనిలో 32.45 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు ధాన్యం, 38.37 లక్షల మెట్రిక్ టన్నులు సన్న వడ్లు కొన్నారు.13 లక్షల 97 వేల మంది రైతుల నుండి 16,912 కోట్ల రూపాయలు విలువైన ధాన్యం కొనుగోలు చేశారు.. ప్రస్తుతం 16.602 కోట్లను రైతు ఖాతాలో జమ చేశారు. అధికారులు ఎక్కడ కూడా ఇబ్బంది కలుగకుండా ధాన్యం సేకరించిన వారం లోపే డబ్బులు చెల్లించారు. 2021 -22 లో 70.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు… ఆ రికార్డు ను ఇప్పుడు ఆదిగమించడం జరిగింది.. ఇది దేశంలోనే నెంబర్. 1 స్థానం సాధించడం రైతుల గొప్ప విజయమని చెప్పొచ్చు…
ఎందుకు ఇది సక్సెస్ స్టోరీ
కనీస మద్దతు ధర భరోసా, రైతుకు మార్కెట్ భయం తొలగింపు, ప్రైవేట్ వ్యాపారుల దోపిడీ లేకుండా ధాన్యం కొనుగోలు చేయడం,తూకం, తేమ పేరుతో కోతలు తగ్గింపు అలాగే
రైతుకు గౌరవప్రదమైన ధర,
ప్రతి మండలం, గ్రామం వద్దే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం,రవాణా ఖర్చు తగ్గడం,మధ్యవర్తులు లేకుండా చేయడం, రైతు సంపర్క కేంద్రాలు, మహిళ సంఘాలకు కొనుగోలు కేంద్రాలు అప్పచెప్పడం తదితర కార్యక్రమాల ఫలితంగా వరి రైతుకు మెరుగైన సౌకర్యాలు వన గూరాయి. వీటి తోపాటు మద్దతు ధర కలిసి రావడంతో లాభం చేకూరింది.
రైతు నేరుగా ప్రభుత్వం
ఇది డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ మోడల్కు చక్కటి ఉదాహరణ.
డిజిటల్ ట్రాకింగ్ పారదర్శకత
రైతు నమోదు ,టోకెన్, తూకం, చెల్లింపు
ప్రతి దశ ఆన్‌లైన్‌లో
అవినీతి, ఆలస్యం తగ్గింపు
డేటా ఆధారిత పాలన వ్యవసాయానికి వచ్చిందని ఇది నిరూపించింది.
*బోనస్ చెల్లించడంలో అలసత్వం వీడాలి.
ఈ సీజన్ లో సన్నలకు బోనస్ కింద 1435 కోట్ల రూపాయలు చెల్లుంచడం జరిగింది.
ప్రభుత్వం సన్నవడ్లు పండించిన రైతులకు బోనస్ ఎకరానికి 500 రూపాయలు చెల్లించడం కాస్త అలసత్వం ఆలస్యం వహిస్తున్నదని రైతులు ఆరోపిస్తున్నారు..
వానాకాలం ముగిసింది,ధాన్యం ప్రభుత్వ గోదాములకు చేరింది.
బియ్యం మిల్లుల ద్వారా పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.
ప్రభుత్వం ప్రకటించిన క్వింటాల్‌కు రూపాయలు 500 బోనస్ రైతుల చేతికి అందుకుండా ఆలస్యం అవుతున్నదని,
ఇది ఆలస్యమా,లేదా పాలనా నిర్లక్ష్యమా అని రైతుల నుండి వినిపిస్తున్న మాటలు.ధాన్యం కొనుగోళ్లు పూర్తి అయ్యే నాటికీ బోనస్ చెల్లింపులు కూడా పూర్తి చేయడానికి అధికారులు కృషి చేస్తారని ఆశిద్దాం……..
మధుగౌడ్.జీ
జర్నలిస్ట్.
9533551188
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Prev Post